బీజేపీకి చంద్రబాబు బంపర్ ఆఫర్.. తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు?
TeluguStop.com
బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని భావిస్తున్న చంద్రబాబు కాషాయ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్నారు.
బీజేపీతో పొత్తుపెట్టుకుంటే జనసేనకు కూడా ఎలాగో ఈ పోత్తులో భాగమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
తాజాగా పార్టీ అంతర్గత సమావేశంలో బీజేపీ, జనసేనల ఉమ్మడి కోటాలో 10 ఎంపీ సీట్లు ఇస్తామని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఏపీలో 25 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో 15 నియోజకవర్గాలు తన పార్టీకి వస్తాయని, 2 లేదా 3 ని జనసేనకి, మిగిలిన వాటిని భాజపాకి వదిలేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నరట.
వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఓట్లు చీలిక ఉండకూడదని భావిస్తున్న చంద్రబాబు ఈ సరికొత్త పొత్తుల రాజకీయానికి తెర లేపారు.
2014 ఎన్నికల్లో బీజేపీకి 5 అసెంబ్లీ స్థానాలను మాత్రమే వదిలిపెట్టిన టీడీపీ ఇప్పుడు 10 ఎంపీ సీట్లను ఆఫర్ చేసింది.
ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ టీడీపీ కలిసి వెళితే ఎలా ఉంటుందనే లెక్కలు వేస్తుంది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణలో తన అవకాశాలను బలోపేతం చేయడానికి మరియు బిజెపికి వ్యతిరేకంగా దూకుడుగా వెళుతున్న కెసీఆర్‌కు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో తన బంధాన్ని పునరుద్ధరించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
"""/" /
ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.తెలంగాణలో టీడీపీ పెద్ద రాజకీయ శక్తి కానప్పటికీ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారు.
పొత్తు వల్ల 'సెటిలర్ల ఓట్లు సాధించాలని బీజేపీ భావిస్తుంది.మిషన్ 2023'లో భాగంగా, బిజెపి దాదాపు 32 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించింది.
ఈ నియోజకవర్గాల్లో సెటిలర్లు ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి.
ఫుట్‌బాల్ మ్యాచ్ లో రెఫరీ నిర్ణయంపై ఘర్షణ.. 100 మంది మృతి