ఫస్ట్ కర్నాటక.. నెక్స్ట్ తెలంగాణ !

దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోనూ బీజేపీని( BJP ) విస్తరించాలని కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.

ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.ఒక్క కర్నాటక మినహా మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు.

కర్నాటకలో( Karnataka ) కూడా ఈసారి అధికారం నిలబెట్టుకోవడం కష్టమే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల( ప్రభావం గట్టిగా ఉండడంతో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

"""/" / అయితే కర్నాటకలో విజయం మాదే అని కమలనాథులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మ్యాజిగ్ ఫిగర్ 113 స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ఇతర పార్టీల అండ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు బీజేపీ పెద్దలు.

కర్నాటక తరువాత అటు తెలంగాణలో కూడా అయితే ఇక ఇదే ఊపులో తెలంగాణలో( Telangana ) కూడా ఇదే ఊపులో అధికారంలోకి వస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి నిజంగానే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా ? సమాధానం చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి బలం పెరిగినప్పటికి అధికారం చేజిక్కించుకునేంతా బలం లేదనేది కొందరి అభిప్రాయం.

</br """/" / కానీ కమలనాథులు మాత్రం అటు కర్నాటక ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవడం పక్కా అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు.

ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా( Amit Shah ) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

సౌత్ రాష్ట్రాలలో కర్నాటక రెండవసారి అధికారంలోకి వాస్తమాన్ని, అటు తెలంగాణలో కూడా బీజేపీపై సానుకూలత పెరిగిందని అమిత్ షా ఇటీవల ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.

ఒకవేళ కర్నాటక మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తే రెట్టించిన ఉత్సాహంతో ఏపీ మరియు తమిళ్ నాడు పై దృష్టి పెట్టె అవకాశం ఉంది.

మరి కమలనాథుల ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదా.. అక్కడ జరిగింది ఇదేనా?