ఈట‌ల‌ను క‌మ‌లం వైపు న‌డిపిస్తున్న ఇద్ద‌రు నేత‌లు.. అధినేత‌కు తెల్వ‌కుండానే?

తెలంగాణ రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం ఈట‌ల రాజేంద‌ర్‌.ఆయ‌న ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అయితే మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌ను బీజేపీలో చేర్చ‌డంలో ఇద్ద‌రు నేత‌లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్ప‌టి నుంచి వారిద్ద‌రే ఈట‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు.

అందులో కేంద్ర స‌హాయ‌మంత్రి కిష‌న్‌రెడ్డి, మాజీఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి.వీరిద్ద‌రే ఈట‌ల‌ను బీజేపీ వైపు న‌డిపించారు.

"""/"/ ఈట‌ల ముందుగా వివేక్ వెంక‌ట‌స్వామిని క‌లిశారు.అప్పుడే వివేక్ ఈట‌ల‌ను బీజేపీలోకి ఆహ్వానించారు.

ఆ వెంట‌నే కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి కూడా ఈట‌ల‌తో వివేక్ ఫాహ్‌హౌస్ లో చ‌ర్చ‌లు జరిపారు.

అయితే బండి సంజ‌య్ చ‌ర్చ‌ల‌కు హాజ‌ర‌యినా.పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు.

కానీ వివేక్, కిష‌న్‌రెడ్డి మాత్రం ఇందులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.ఈట‌ల‌తో ప‌లుమార్లు హైద‌రాబాద్ శివారులోని వివేక్ ఫాహ్‌హౌస్ కు రప్పించి మ‌రీ మంత‌నాలు జరిపారు.

"""/"/ బీజేపీలో చేరితో క‌లిగే లాభాల గురించి వివ‌రించారు.అలాగే పార్టీప‌ర‌మైన హామీ కూడా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక వివేక్ ఈట‌ల‌ను ద‌గ్గ‌రుండి ఢిల్లీకి తీసుకెళ్లి న‌డ్డాతో మాట్లాడించారు.ఇక అప్ప‌టి నుంచి వివేక్ అన్ని కార్య‌క్ర‌మాల్లో ఈట‌ల వెంటే ఉంటున్నారు.

అయితే ఇందులో బండి సంజ‌య్‌కు పెద్ద‌గా ప్ర‌మేయం లేకుండానే వీరిద్ద‌రూ క‌లిసి రాజ‌కీయాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

బండి సంజ‌య్ స్పీడుకు బ్రేకులేసేందుకు ఈట‌ల‌ను క‌మ‌లంపార్టీలోకి తీసుకొస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

ఏది ఏమైనా ఈట‌ల చేరిక‌లో వివేక్ వెంక‌ట‌స్వామి, కిష‌న్‌రెడ్డిల‌ది కీల‌క పాత్ర అనే చెప్పాలి.

మ‌రి వీరు అనుకున్న‌ట్టు గానే బండికి బ్రేకులు ప‌డ‌తాయా లేక ఈట‌ల సైలెంట్ అవుతారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

కానీ ఈట‌ల చేరిక‌తో బీజేపీ బ‌లం పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి అనుమానాలు లేవు.ఈట‌ల గ‌న‌క గెలిస్తే బీజేపీని ఆప‌డం టీఆర్ ఎస్‌కు సాధ్యం కాద‌నే చెప్పాలి.

మ‌రి వీరి వ్యూహాల‌ను గులాబీ బాస్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మురారి ఫ్లాప్ అని కామెంట్ చేసిన నెటిజన్.. కృష్ణవంశీ రియాక్షన్ కు షాకవ్వాల్సిందే!