టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తేల్చేసిన బీజేపీ నేతలు

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక అయిన నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, మునుగోడులో ఓటమితో కేసీఆర్ చాఫ్టర్ క్లోజ్ అవుతుందని బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి బాంబ్ మంగళవారం బాంబ్ పేల్చారు.

మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం పర్వదినం రోజు కూడా కొనసాగడంతో మునుగోడు మండల కేంద్రంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు ఆఫీస్ లో ఉదయం నుండి రాత్రి వరకు నియోజకవర్గ పరిధిలోని చండూర్,మునుగోడు, నాంపల్లి మండలాల నుండి వివిధ పార్టీలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్,టీఆర్ఎస్ ముఖ్యనాయకులు,యువత దాదాపుగా 1500 మంది బీజేపీ ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి,రాజగోపాల్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు.

వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినాకా ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలో ఒక క్లారిటీకి వచ్చారని,ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు.

రెండు ఊళ్ళకి ఒక్కో ఎమ్మెల్యేని పెడుతున్నారని,ఓడిపోతానన్న భయం కేసీఆర్ కి పట్టుకుందని,అందుకే ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్ధం కావడంలేదని,టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి కేసీఆర్ దని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలుపుని ఆపలేరని,ప్రజలు అందరూ ఈ రోజు కేసీఆర్ ఆడే అబద్దాలను నమ్మే స్థితిలో లేరన్నారు.

ఇక్కడి ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని,నేను రాజీనామా చేశాక ఎన్ని అభివృద్ధి పనులు జరిగినయో ప్రజలందరూ గమనించారన్నారు.

కేసీఆర్ ఎన్ని పథకాలు ఇచ్చినా తీసుకుంటారు కానీ,ఓటు మాత్రం బీజేపీకే వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

దీనితో టీఆర్ఎస్,కేసీఆర్ దుకాణం ఖేల్ ఖతమని అన్నారు.

బాలయ్య బాబీ మూవీకి ప్రచారంలో మరో టైటిల్.. ఇలాంటి టైటిల్ సూటవుతుందా?