రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న బిజెపి నేతలు..

అడ్డుకున్న బిజెపి నేతలు.సరూర్నగర్ వి.

ఎం హోం లో రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ను స్థానిక బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అడ్డుకున్నారు.

విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేల షూటింగ్లకు అనుమతి ఏ విధంగా ఇస్తారు అని ఆమె ప్రశ్నించారు.

విద్యాశాఖ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారని కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు.

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నాణ్యత మైన విద్యను అందించాల్సిన బాధ్యత మరిచి షూటింగ్ల పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖజానాలను నింపుకుంటుందని ఆమె ఆరోపించారు.

వెంటనే రాంచరణ్ షూటింగు ఆపేయాలని ఆమె బిజెపి శ్రేనులతో కలిసి ధర్నా చేపట్టారు.

పవన్ దూకుడుపై టీడీపి అలెర్ట్ ! బిజేపి పై అనుమానం ?