అమరావతిపై కీలక ప్రకటన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి!
TeluguStop.com
ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తరచూ ఓ మాట చెబుతుండే వారు.
హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టింది తానే అని.కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం దానిని రివర్స్ చేశారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అసలు మ్యాప్‌లోనే లేకుండా చేశారు. """/"/ఈ మధ్య జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత కేంద్రం కొత్తగా ఇండియా మ్యాప్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలుసు కదా.
అందులో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి.ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు తప్ప.
అమరావతి విషయంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పునరాలోచనలో పడింది.అసలు దానిని రాజధానిగా కొనసాగించాలా లేదా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ కమిటీని కూడా నియమించింది.
"""/"/దీంతో ఏపీకి అధికారికంగా ఓ రాజధాని అంటూ లేకుండా పోయింది.ఏం చేయాలో తెలియక కొత్త మ్యాప్‌ను ఏపీకి రాజధానిని లేకుండానే రూపొందించేశారు.
అయితే ఇది ప్రతిపక్ష టీడీపీకి అస్సలు నచ్చలేదు.అమరావతిని ఓ ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు.
ఇప్పుడు కనీసం ఇండియా మ్యాప్‌లోనూ ఆ నగరం లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. """/"/కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దగ్గర ఇదే విషయాన్ని మొరపెట్టుకున్నారు.
దీంతో అమరావతిని కూడా మ్యాప్‌లో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారట.రాజధాని అక్కడే ఉంటుందో లేదో తెలియదు కానీ.
కనీసం మ్యాప్‌లో అయినా అమరావతిని చూసుకునే అదృష్టం ఏపీ ప్రజలకు కలుగుతోదంటూ అప్పుడే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.