కడప ప్రజలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలంటన్న బీజేపీ నేత..!!
TeluguStop.com
బీజేపీ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి విషయంలో సొంత జిల్లాను గాలికి వదిలేసారని వ్యాఖ్యానించారు.సొంత జిల్లాని అభివృద్ధి చేసుకో లేకపోతే రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదేవిధంగా బీజేపీ మరియు జనసేన పార్టీలను విడగొట్టడం ఎవరి తరం కాదని అన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రచారం కోసం పరితపించే వ్యక్తి అని పేర్కొన్నారు.
రాంగోపాల్ వర్మ లాంటి పిచ్చోడికి రాయి ఇస్తే మన మీద పడుతుందని విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే బుధవారం ప్రవేట్ గా సీఎం జగన్ ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కలవటం జరిగింది.
జగన్ తో భేటీ తర్వాత ఎక్కడా కూడా ఆర్జీవి మీడియాతో మాట్లాడలేదు.ఆ తర్వాత గురువారం సోషల్ మీడియాలో వ్యూహం, శబదం సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.
ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా చేస్తున్నట్లు ఆర్జీవి స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఆర్జీవి పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
చిరంజీవి సినిమాను ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న శ్రీకాంత్ ఓదెల…మరి ఇది వర్కౌట్ అవుతుందా..?