రాజస్థాన్ లో బయట పడ్డ వ్యభిచార దందా ….బీజేపీ మహిళా నేత హస్తం!
TeluguStop.com
రాజస్థాన్ లో సెక్స్ రాకెట్ వెలుగులోకివచ్చింది.సవాయి మాధోపూర్ లో 17 ఏళ్ల యువతి, వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని, పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయడం తో ఈ వ్యవహారమా వెలుగు చూసింది.
అయితే ఈ రాకెట్ వెనుక బీజేపీ మహిళా నేత హస్తం ఉండడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న సునీత వర్మ స్వయంగా ఈ దందాను నడిపిస్తోందని తేల్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
సునీతాను పోలీసులు గత నెల 26న అరెస్టు చేయడంతో తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.
అలానే ఈ సెక్స్ రాకెట్ లో భాగం పంచుకున్న ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగినులు, మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసుతో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నేత పూనమ్ చౌదరితో పాటు, మరో ఇద్దరికి కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారని, త్వరలోనే వీరిని అరెస్ట్ చేస్తామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
అయితే వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.బీజేపీ మహిళా నేత తో పాటు కాంగ్రెస్ నేత హస్తం కూడా ఈ సెక్స్ రాకెట్ వెనుక ఉన్నట్లు తెలుస్తుంది.
రాజకీయ నాయకులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్రోకరేజ్ పనులు నిర్వహించినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వంలో పనులను చేయించుకోవడానికి పెద్ద పెద్ద నాయకులకు మైనర్ బాలికలను ఎరగా వేసి తమ ఫోటోలను చూపించి కార్యకలాపాలు సాగిస్తున్నారు అని బాధితురాలు వాపోయింది.
అంబుడ్స్‌మన్‌ను తొలగించిన ట్రంప్ .. హెచ్ 1 బీ వీసాదారులు , విద్యార్ధులపై ఎఫెక్ట్