కాంగ్రెస్ నుంచే పోటీ ? క్లారిటీ ఇచ్చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ?
TeluguStop.com
మునుగోడు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy ) వ్యవహారం ఆ పార్టీతో , పాటు తెలంగాణ రాజకీయ వర్గాలలోను చర్చనీయాంశంగా మారింది.
గతంలో అనేకసార్లు మునుగోడు( Munugodu ) ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి ఈసారి మాత్రం బిజెపి( BJP ) నుంచి మునుగోడులో పోటీ చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.
మునుగోడులో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తే ఓటమి తప్పదనే సర్వే నివేదికలతో రాజగోపాల్ రెడ్డి వెనకడుగు వేస్తున్నారు.
దీనికి తోడు ఆయన చాలా రోజులుగా తిరిగి కాంగ్రెస్ లో( Congress Party ) చేరాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ బాగా బలం పుంజుకోవడం, పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరుతుండటంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం, తెలంగాణలో బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోటీ ఉండబోతుందనే సర్వే నివేదికలతో రాజగోపాల్ రెడ్డి ఆలోచనలో పడ్డారు.
"""/" /
దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరి మునుగోడు అసెంబ్లీ( Munugodu Assembly ) నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఊపు అందుకుంది.
ఇదే విషయమే రాజగోపాల్ రెడ్డి తాజాగా స్పందించారు.ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అనుకుంటున్నాను కానీ , మునుగోడు ప్రజలు నాపై ఒత్తిడి చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచే పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.కానీ నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఉప ఎన్నికలకు, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
"""/" /
దీంతో ఆయన మనసులోనూ కాంగ్రెస్ లో చేరాలనే ఆకాంక్ష ఉందని, అందుకే ప్రజలే కాంగ్రెస్ లో చేరి మునుగోడు నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నట్లుగా అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే ఆయన గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో చేరే విషయమే తన ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .
మరో మూడు రోజుల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.
అమీర్ ఖాన్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడా..?