వీడియో వైరల్.. వృద్ధ మామను తోసేసిన బీజేపీ నాయకురాలు
TeluguStop.com
తాజాగా ఒక బీజేపీ నాయకురాలు( BJP Leader ) వృద్ధుడైన మామ పట్ల తీవ్రంగా అమర్యాదగా ప్రవర్తించి సోషల్ మీడియాలో వార్తలలో నిలిచింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
మామ, కోడలు మధ్య జరిగిన చిన్న గొడవ కాస్త సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే. """/" /
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో( Patiala ) బీజేపీ బ్లాక్ ప్రెసిడెంట్ తారాబాయి అలియాస్ మార్గరెట్ డిసౌజా ,( Tara Bai Alias Margaret D’Souza ) 81 సంవత్సరాలు గల విజయ్ సింగ్( Vijay Singh ) పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఆమె కిచెన్ లో వీడియో కాల్ లో మాట్లాడుతున్న క్రమంలో ఆమె మామ కిచెన్ లో టీ పెట్టేందుకు ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో అతడిని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె మొబైల్ ఫోన్ కాస్త కింద పడింది.
అనంతరం కింద పడిన మొబైల్ ఫోను తీసుకొని తారాబాయి ఆ తర్వాత పోయి ఉన్న పాత్రలు కూడా పక్కకు తీసేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది.
"""/" /
ఫోన్ లో వీడియో కాల్ లో ట్లాడుతున్న ఆమె రెండుసార్లు వంటగదిలోకి వచ్చి అటు ఇటు వెళ్లడం మనం వీడియోలో చూడవచ్చు.
ఇది అంతా జరుగుతున్న కూడా ఆ వృద్ధుడు తనకు కావాల్సిన టీ తయారు చేయడంలో నిమగ్నం అయ్యాడు.
కానీ, ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ బీజేపీ నాయకురాలు చేసిన వైఖరిని ఖండిస్తున్నారు.
మరికొందరు అయితే బీజేపీకి ఫిర్యాదు చేయాలని సదరు మహిళ నాయకురాలు పై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
ఎంత పని చేస్తివి రోహిత్ బ్రో.. అక్షర్ హ్యాట్రిక్ మిస్!(వీడియో)