కేసీఆర్ పీక పట్టుకుంటున్న బీజేపీ..ఇదేంటీ స్వామి

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కి పెద్ద చిక్కు వచ్చిపడింది.తెలంగాణ నుంచి స్వామి పరిపూర్ణానందను బహిష్కరించడంతో బీజేపీ కారాలు మిర్యాలు నూరుతోంది.

దీంతో కేసీఆర్ కి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి వచ్చింది.

ఈ విషయంలో ఏ స్టెప్ తీసుకోవాలి అనే ఆందోళన ఆయనలో కనిపిస్తోంది.ఎందుకంటే పరిపూర్ణానంద స్వామి బహిష్కరణ విషయాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎటి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో తాడో పేడో తేల్చేయాలని బీజేపీ చూస్తోంది.

ఈ అంశంపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా స్పందించారు.ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ఒక లేఖ రాశారు.

గూండాలను బహిష్కరించేందుకు ఉన్న చట్టాలను పరిపూర్ణానందపై ప్రయోగించడం దారుణమంటూ ఖండించారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కత్తి మహేష్ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చెలరేగడం, హిందూ ధర్మ పరిక్షణకు తాను యాత్ర చేస్తానంటూ పరిపూర్ణానంద ముందుకు రావడం, నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆయన్ని బహిష్కరిస్తున్నట్టు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించిన సమయంలో పోలీసులు ఒక నోటీసును జారీ చేశారు.

దీంట్లో సెక్షన్ 3 ప్రకారం ఆయన్ని నగరం నుంచి బయటకి పంపించారని పేర్కొన్నారు.

ఇదే అంశాన్ని సుబ్రహ్మణ్య స్వామి ప్రస్థావిస్తూ.ఆ సెక్షన్ ను ప్రయోగించినవారు దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగా లేరన్నారు.

గూండాలను బహిష్కరించేందుకు మాత్రమే దీన్ని వాడాలనీ, ఈ సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తిని బహిష్కరించాలంటే.

దానికంటే ముందుగా ఆ వ్యక్తిని గూండా అంటూ ప్రకటించాల్సి ఉంటుందన్నారు.ఇప్పుడు అభ్యన్తరం అంతా ఇక్కడే వస్తోంది.

పరిపూర్ణానంద స్వామిని ఏ రకంగా గూండా అని నిర్ధరణకు వచ్చారు, ఏ విధంగా ప్రకటించారు అంటూ ఆయన కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నారు.

రాజ్యాంగ ప్రకారం స్వామీజీకి ఉన్న ప్రాథమిక హక్కుల్ని మీరు కాలరాశారు అంటూ మండిపడుతున్నారు.

ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలబోనని కోర్టులోనే తేల్చుతాను అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలే రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి హిందూ ఎజెండా గా పనిచేసే బీజేపీ పరిపూర్ణానంద విషయంలో వెనక్కి తగ్గితే రాజకీయంగా కూడా దెబ్బతినాల్సి ఉంటుంది అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోంది.

రాజోలు వారాహి సభలో సిఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!