ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా నేత గోలి…!
TeluguStop.com
నల్గొండ జిల్లా:మాడుగులపల్లి మండలంలోని ఐకెపి సెంటర్ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ఆదివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ కి తరలించగా ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ,గన్ని బ్యాగుల, వ్యవస్థ తార్పాన్లు ఊసే లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పట్ల నిమ్మకు నిరత్తినట్లు ప్రవర్తించే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకొని,త్వర త్వరగా వడ్లు కాంటా వేసి కాంటా అయిన బస్తాలను ఐకేపి సెంటర్ నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలకూరి ఎలెంద్ర గౌడ్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చలమల సీతారాం రెడ్డి, మాడుగులపల్లి మండల అధ్యక్షులు నరసింహ, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి,దుబ్బాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
పాకిస్థానీకి చుక్కలు చూపించిన ఇండియన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!