ఆ తేదీన బీజేపీ కీలక సమావేశం ! ఒకటే హడావుడి ?

జాతీయ స్థాయిలో బీజేపీ లో ఇప్పుడు కీలక సమావేశం నిర్వహించే ఆలోచన చేస్తోంది.

నరేంద్ర మోదీ సారథ్యంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి మే 25వ తేదీ నాటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బిజెపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశం నిర్వహణ ను బిజెపి అగ్రనాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోం మత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాల నిమిత్తం ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయంపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏమేమి సంస్కరణలు తీసుకు వచ్చారు.

చేసిన అభివృద్ధి పనులు, కీలక నిర్ణయాలు వంటి వాటిని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనే విషయం పైన ఈ సమావేశంలో చర్చించి పోతున్నారట.

ఇప్పటివరకు కేంద్రం చేపట్టిన పనులను ప్రజలకు తెలియజేసే నిమిత్తం ఒక్కో మంత్రికి కనీసం నాలుగు లోక్ సభ నియోజక వర్గాలను కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

మే 30 వ తేదీ నుంచి జూన్ 15 వరకు '' సేవా సుశసన్ , గరీబ్ కళ్యాణ్, థీమ్ పై మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది.

"""/" / మే 20న జైపూర్ లో జరిగిన ఆఫీస్ బేరర్స్ మీట్ లో ప్రభుత్వ నివేదికను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు.

అలాగే శుక్రవారం జరిగిన సమావేశంలోనూ బిజెపి ప్రభుత్వం వేడుకలను ఏవిధంగా జరిగిపోవాలి అనే దానిపైన మూడు తీర్మానాలు చేశారు.

మొత్తం గా జాతీయ స్థాయిలో బీజేపీ ఎనిమిదేళ్ళ పాలన వేడుకలను నిర్వహించేందుకు కసరత్తు గట్టిగానే చేస్తోంది.

ఈ రాశుల వారికి.. ఈ సంవత్సరం అంతా శశ రాజయోగం..!