కర్ణాటకలో బీజేపీ -జేడీఎస్ మధ్య పొత్తు ఖరారు..!
TeluguStop.com
2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఖరారు అయింది.
ఈ విషయాన్ని స్వయంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రకటించారు.కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తో కుమారస్వామి కీలక సమావేశం అయిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో పొత్తు అంశంతో పాటు సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించారు.భేటీ అనంతరం కుమార స్వామి బీజేపీతో జేడీఎస్ పొత్తు ఖరారు అయిందని ప్రకటించారు.
ఈ క్రమంలో రానున్న 2024 ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా మాండ్య, హసన్, బెంగళూరు (రూరల్) మరియు చిక్‌బల్లాపూర్ స్థానాల నుంచి జేడీఎస్ బరిలో దిగనుందని సమాచారం.
కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?