బీజేపీది పేదల పోరాటం..: బండి సంజయ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది కబ్జాల ఆరాటమన్న ఆయన తమది పేదల పోరాటమని తెలిపారు.

ఈ క్రమంలో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు.అబద్ధాలు, మోసాలు, భూ కబ్జాల్లో మంత్రి గంగుల కమలాకర్, పురమళ్ల నంబర్ వన్ అని ఆరోపించారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ కు పంజాబ్ రైతులపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతులపై లేదని విమర్శించారు.

అభివృద్ధి, సంక్షేమం కేవలం బీజేపీ సర్కార్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.

నెల్సన్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడా..?