కాంగ్రెస్ టార్గెట్ బిఆర్‌ఎస్ కాదు.. బీజేపీనే ?
TeluguStop.com
తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పట్టు కోసం ప్రధాన పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు పోలిటికల్ హిట్ మరింత పెంచుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా మెయిన్ లైమ్ లోకి వచ్చింది.కర్నాటక ఎన్నికల ముందు అసలు రేస్ లో ఉందా లేదా అనట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన పార్టీ.
ఆ రాష్ట్ర ఎన్నికల తరువాత అనూహ్యంగా తెలంగాణలో కూడా పుంజుకుంది.ప్రస్తుతం తెలంగాణలో బీజేపీని వెనక్కి నెట్టి బిఆర్‌ఎస్( BRS Party ) కు ప్రత్యామ్నాయంగా ఉండేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది.
"""/" / కాగా వచ్చే ఎన్నికల్లో అటు బీజేపీ( BJP ) అయిన ఇటు కాంగ్రెస్ అయిన బిఆర్‌ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం బిఆర్‌ఎస్ కంటే కూడా బీజేపీనే ప్రత్యర్థిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఆ మద్య బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేలా ఆ పార్టీ దూకుడు వ్యవహరించింది.
దాంతో కాంగ్రెస్ ప్రస్తావన చాలావరకు తగ్గుతూ వచ్చింది.అయితే కర్నాటక ఎన్నికల్లో గెలుపు తరువాత జోష్ పెంచిన టి కాంగ్రెస్ బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలంటే బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి.
ప్రస్తుతం ఆ దిశగానే హస్తం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. """/" / గతంలో పార్టీ బలహీనంగా ఉందనే ఉద్దేశంతో పార్టీ వీడి బీజేపీలో చేరిన వారిని తిరిగి కాంగ్రెస్ లోకి చేరాలని ఆహ్వానం పలుకుతోంది.
గతంలో బలహీనంగా ఉన్న బీజేపీ కాంగ్రెస్( Congress Party ) నేతల చేరికతోనే రాష్ట్రంలో బలపడింది.
ఇప్పుడు తిరిగి నేతలను ఆకర్షించగలిగితే మళ్ళీ బీజేపీ బలహీన పడుతుందనే ప్లాన్ లో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పుడు బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నిలిచేందుకు ఎలాంటి అడ్డు ఉండదని టి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట.
ఇప్పటికే కొందరు బీజేపీ నేతలతో హస్తం నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల ముందు పెద్ద ఎత్తున బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు టి కాంగ్రెస్ నేతలు.
మరి ప్రత్యామ్నాయంగా నిరూపించుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
స్కిన్ ను టైట్ అండ్ గ్లోయింగ్ గా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ మీకోసం!