చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదు..: నారా లోకేశ్
TeluguStop.com
టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తాను భేటీ అయినట్లు తెలిపారు.
ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు.
రాజకీయ కక్ష సాధింపు జరుగుతుందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని తాను అమిత్ షాను కోరినట్లు లోకేశ్ వెల్లడించారు.
ఈ మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కాల్ చేసి అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు.
అయితే రాజకీయాల గురించి అమిత్ షాతో ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు.కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పానన్న లోకేశ్ సీఐడీ ఎందుకు పిలిచిందని అమిత్ షా అడిగారని తెలిపారు.
తరువాత చంద్రబాబు ఆరోగ్యం గురించి అమిత్ షా అడిగారని చెప్పారు.తమను కేసులతో ఇబ్బంది పెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారన్న లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డులో స్కాం లేదని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు.
మణిరత్నం చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్న నందమూరి బ్రహ్మిని…