బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదు..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన నేత ఈటల రాజేందర్( Etala Rajender ) అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఈటల రాజేందర్ ను గెలిపించుకుందామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణలో 12 కు పైగా స్థానాలను గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ కు బీజేపీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదని చెప్పారు.బీఆర్ఎస్ నేతలు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని తెలిపారు.

ఆ విషయంలో మెగా కోడలిని ఫాలో అవుతున్న అక్కినేని కోడలు… ఏమైందంటే?