ఆ విష‌యంలో డైల‌మాలో ప‌డ్డ బీజేపీ.. ఏపీలో ఎవ‌రితో పొత్తు..?

ఏపీ రాజ‌కీయాల్లో ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా అని అంద‌రికీ తెలిసిందే.ఇక్క‌డ జాతీయ పార్టీల హ‌వా ఏ మాత్రం కూడా లేదు.

అందుకే కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న బీజేపీ పార్టీ ఇక్క‌డ ప్రాంతీయ పార్టీల అండ‌తోనే రాజకీయాలు చేస్తోంది.

గ‌తంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో విడిపోయింది.దీంతో వైసీపీతో బ‌హిరంగ ర‌హ‌స్య పొత్తు పెట్టుకుంది.

వైసీపీ మాత్రం తాము ఎవ‌రితోనూ పొత్తులు పెట్టుకోమ‌ని చెబుతున్నా కూడా ఇన్ డైరెక్టుగా బీజేపీకి స‌పోర్టుగానే ఉంటోంది.

అయితే అది కేవ‌లం కేంద్రం వ‌ర‌కే ప‌రిమితం అవుతోంది.బీజేపీ ఎలాగైనా మ‌రోసారి కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని చూస్తోంది.

ఇందుకోసం ఎవ‌రితో అయినా పొత్తులు పెట్టుకోవ‌డానికి రెడీ అయిపోతోంది.దీంతో టీడీపీ పొత్తులకు సంకేతాలు ఇస్తోంది.

బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తాము రెడీ అన్న‌ట్టు ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఇంటిమేష‌న్ లు కూడా ఇచ్చేస్తున్నారు.

కానీ బీజేపీ మాత్రం కాస్త డైల‌మాలో ప‌డిపోతోంది.ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు బీజేపీ పొత్తును వ‌ద్ద‌నుకుని తీవ్ర స్థాయిలో మోడీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం కూడా చేశారు.

కాబ‌ట్టి మ‌ళ్లీ ఆయ‌న‌తో పొత్తు పెట్టుకుంటే త‌మ‌కే న‌ష్ట‌మ‌ని భావిస్తున్నారంట‌. """/"/ ఇంకోవైపు వైసీపీతో అంత‌ర్గ‌త పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నిక‌ల‌ల్లో వైసీపీతో కేంద్రం వ‌ర‌కు పొత్తు పెట్టుకోవాల‌ని బీజేపీ చూస్తోంది.

ఎందుకంటే ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీ మీద వ్య‌తిరేక‌త ఏర్ప‌డ‌టంతో మ‌రోసారి మోడీని ప్ర‌ధాని చేయాలంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌ను న‌మ్ముకోవాల్సిందే.

ఇందుకోస‌మే కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డాలంటే వైసీపీ స‌పోర్టు బీజేపీకి కావాలి.ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో వైసీపీ బీజేపీకి స‌పోర్టుగా ఉంది.

ఏపీలో బ‌ల‌ప‌డ‌టం క‌న్నా కూడా బీజేపీకి కేంద్రంలో అధికారంలోకి రావ‌డ‌మే ముఖ్యం అని తెలుస్తోంది.

అందుకోస‌మే వైసీపీ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది కేంద్ర నాయ‌క‌త్వం.మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ నో అంటే టీడీపీనే దిక్కు.

కానీ టీడీపీతో డేంజ‌ర్ అని మోడీ భావిస్తున్నారంట‌.ఇలా ఈ రెండు పార్టీల‌తో బీజేపీ డైల‌మాలో ప‌డింది.

British Public : భారీ విరాళాలతో గొప్ప దాతృత్వాన్ని చాటుకున్న బ్రిటిష్ ప్రజలు..!