జగన్ వదిలిన బాణానికి ' గమ్యం ' చూపించబోతున్న బీజేపీ?

తాను జగనన్న వదిలిన బాణం అంటూ అప్పట్లో వైఎస్ షర్మిల వైయస్సార్ సిపి తరపున ప్రచారం చేసిన సమయంలో వ్యాఖ్యానించారు.

జగన్ జైలు జీవితం అనుభవించిన సమయంలో షర్మిల పాదయాత్ర చేపట్టి, ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరఫున ప్రచారానికి దిగారు .

అయితే ఆమె ఏపీ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాల్లోనే రాణించాలని నిర్ణయించుకోవడంతో వైఎస్సార్  తెలంగాణ పార్టీని స్థాపించారు.

గత కొంతకాలంగా తెలంగాణలో హడావుడి చేస్తున్నారు.ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు.

అయితే షర్మిల పాదయాత్ర, ఆమె చేస్తున్న రాజకీయ విమర్శలకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో అయితే గుర్తింపు లభించడం లేదు.

ఇక ఆమె పార్టీనీ మిగతా రాజకీయ పార్టీలేవి అసలు పరిగణంలోకి తీసుకోవడం లేదు.

అయితే చిన్న చితకా పార్టీల కారణంగా ఎన్నికల సమయంలో తమకు ఇబ్బందులు ఏర్పడతాయనే విషయాన్ని బిజెపి గుర్తించింది.

ఈ క్రమంలోనే బిజెపి నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది.దీంతో  ఆమె 6,7 తేదీల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం పాదయాత్రను వాయిదా వేసుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు.

బిజెపి పెద్దలతో ఆమె భేటీ కాబోతున్నారు.ఇప్పటి వరకు షర్మిల బిజెపికి ప్రత్యక్షంగా గాని,  పరోక్షంగా గాని మద్దతు ఇవ్వలేదు.

కానీ బిజెపిని ఇప్పుడు షర్మిలను గుర్తించి ఢిల్లీకి పిలవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంటుంది .

కానీ చిన్న చిన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చితే అది టిఆర్ఎస్ కే మేలు చేస్తుందనే విషయాన్ని బిజెపి గ్రహించింది.

దీనిలో భాగంగానే షర్మిలను తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకునేలా ఒప్పించి ఏపీ రాజకీయాల్లో ఆమెను యాక్టివ్ అయ్యేలా చేయాలని బిజెపి పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  """/"/ ఈ మేరకు బిజెపి రాజకీయ వ్యవకర్తలు షర్మిలకు వాస్తవ పరిస్థితులను వివరించబోతున్నారట.

ప్రస్తుతం షర్మిల జగన్ మధ్య ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో,  ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా షర్మిలను రంగంలోకి దించాలని బిజెపి వ్యూహం పన్నినట్టు సమాచారం.

ఏపీలో వైసిపి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తో పాటు , ఇంకా అనేక ప్రజా సమస్యల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోంది.

ఈ క్రమంలో షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని , తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకోవాలనే విషయాన్ని బిజెపి పెద్దలు చెప్పే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

కుప్పం అభ్యర్థిగా రేపు చంద్రబాబు నామినేషన్