బీజేపీది దివాళాకోరు రాజకీయం.. మంత్రి హరీశ్ రావు
TeluguStop.com
బీజేపీపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం బీజేపీ దివాళకోరు రాజకీయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
స్వార్థ రాజకీయాల కోసం భవిష్యత్ తరాలతో ఆడుకోవద్దని సూచించారు.నిన్న మధ్యాహ్నం పేపర్ లీకేజీపై ధర్నా చేసిన బీజేపీ రాత్రికి నిందితులను విడుదల చేయాలంటూ ధర్నా చేసిందని విమర్శించారు.
అంతేకాకుండా టెన్త్ తెలుగు పేపర్ లీక్ లోనూ, హిందీ పేపర్ లీక్ లోనూ బీజేపీ సన్నిహితులే ఉన్నారన్నారు.
పసిపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
కరెన్సీ నోట్ల కట్టలను మంటల్లో పడేసిన యూఎస్ వ్యక్తి.. వీడియో వైరల్..