బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ

సూర్యాపేట జిల్లా:ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చి మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు.

మంగళవారం కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ వర్గీకరణ చేయకపోగా దేశవ్యాప్తంగా రోజురోజుకీ దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు.

భారత దేశంలో అన్ని మతాలు, అన్ని కులాల వారు స్వేచ్ఛగా జీవించవచ్చని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగ్గలో తొక్కుతూ కులాలు,మతాల మధ్య చిచ్చు పెడుతూ మహమ్మదీయులు,క్రైస్తవులను జైశ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతుందన్నారు.

ఎన్నో క్లిష్ట సమస్యలు పరిష్కరించిన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మాల,మాదిగల మధ్య చిచ్చు పెడుతుందన్నారు.

వర్గీకరణ సాధించేంతవరకు ఎమ్మార్పీఎస్ టీఎస్ పోరాడుతుందన్నారు.వచ్చే నెలలో జంతర్ మంతర్ వద్ద చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ కలకొండ ఆదినారాయణ సతీమణి కలకొండ సత్యవతి మృతి పట్ల సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతాబాబు మాదిగ,జిల్లా అధ్యక్షులు వడిదల రవికుమార్,కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి నాగరాజు,రాష్ట్ర కార్యదర్శి రావూరి విజయభాస్కర్,రాష్ట్ర నాయకులు కడప పెంటయ్య,పిడమర్తి వెంకట నారాయణ,గ్రామ ఎంపీటీసీ కలకొండ బాలకృష్ణ,వెంకటయ్య,అమరబోయిన దావీద్, జయరాజు,గురు ప్రసాద్,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత