యూపీలో రోజు రోజుకి పడిపోతున్న బిజెపి గ్రాఫ్..!!

మరికొద్ది నెలల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

జరగబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం.

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.ఎలాగైనా మరోసారి విజయం సాధించాలని.

బీజేపీ పెద్దలు.యూపీ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు.

పరిస్థితి ఇలా ఉంటే యూపీ బీజేపీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు సరిగ్గా ఎన్నికలకు ముందు.

పార్టీ హైకమాండ్ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తూ.ఇతర పార్టీలోకి జంప్ అయిపోతున్నారు.

మొన్నటి దాకా ఆరుగురు బీజేపీ  ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా.తాజాగా మరో ఎమ్మెల్యే బీసీ నేత ముఖేష్ వర్మ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.

ఈ నేపద్యంలో బీజేపీ లో దళితులకు వెనుకబడిన వర్గాలకు అదేవిధంగా మైనార్టీలకు గౌరవం లేదని.

ఈ వర్గాలకు చెందిన నాయకులను బీజేపీ  పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.అంత మాత్రమే కాక రైతులు నిరుద్యోగ మరియు యువత చిన్న మధ్య తరగతి పరిశ్రమలను కూడా బీజేపీ పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందువల్లే తాను బీజేపీ పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో స్పష్టం చేశారు.పరిస్థితి ఇలా ఉంటే మరి కొంతమంది నేతలు కూడా.

దళితులు బిసి వెనకబడిన వర్గాలు మరియు మైనార్టీలకు చెందిన నేతలు.కూడా పార్టీ నుండి బయటకు వచ్చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లక్షల్లో జీతాన్నిచ్చే జాబ్ వదిలి సివిల్స్ లో 18వ ర్యాంక్.. వార్ధా ఖాన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!