ప్రజలకు బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్ డిమాండ్
TeluguStop.com
పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని విమర్శించారు.దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం నిలువున దోచుకుంటోందని ఆరోపించారు.
పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిసరుకు కాదని, మోదీ నిర్ణయించిన చమురు ధరలేనని మరోసారి రుజువైందని వ్యాఖ్యనించారు.
తమ కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకే ధరలను పెంచుతున్నారన్నారు.ధరల భారంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని వెల్లడించారు.
గజిని సీక్వెల్ గురించి మురుగదాస్ క్లారిటీ ఇదే.. ఈ సీక్వెల్ అలా ఉండబోతుందా?