రాబార్ట్ వాద్రాకు బీజేపీ ప్రభుత్వం క్లీన్ చిట్..!

భూమి అమ్మకం విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది.

స్కైలైట్ హాస్పిటాలిటీ భూమిని డీఎల్ఎఫ్ కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

2014 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాబర్ట్ వాద్రా అక్రమ భూ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైన దాదాపు ఐదేళ్ల తరువాత హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది.

రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..