బిజెపి మొదటి విడత జాబితా నేడు విడుదల ?
TeluguStop.com
తెలంగాణ బిజెపి( Telangana BJP ) అసెంబ్లీ అభ్యర్థుల మొదటి విడత జాబితా నేడు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, కాంగ్రెస్ మొదటి విడత 55 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది .
ఈ రేసులో బిజెపి వెనుక పడింది.మరోవైపు పోలింగ్ సమయం దగ్గరకు వస్తుండడం , ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో , బిజెపి అభ్యర్థుల జాబితా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.
ఈరోజు బిజెపి ఎలక్షన్ కమిటీ నేడు ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో బేటి కానుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పైన చర్చించబోతున్నారట.
ఆ చర్చలు అనంతరం మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలంగాణ బిజెపి వర్గాలు పేర్కొన్నాయి.
"""/" /
తొలి విడతలు 38 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.
అందులో సింగిల్ నేమ్ తో 21 మంది అభ్యర్థులను పార్టీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
మిగతా స్థానాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు పేర్లను అధిష్టానానికి పంపించారట అయితే ఎన్నికల కమిటీ సమావేశం కనుక అనుకున్న మేర జరగకపోతే జాబితా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందట .
అయితే ఇప్పటికే ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ బిజెపి కీలక నేతలంతా ఢిల్లీకి వెళ్లారు .
"""/" /
కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) తో పాటు, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బాన్సాల్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ , పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(9 Etela Rajender ) ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
వీరంతా ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొని అనంతరం పార్టీ అభ్యర్థుల ఎంపికైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.
దీంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారంతా ఈరోజు జరగబోయే ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉండడంతో తెలంగాణ బిజెపి నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
అందంగా పుట్టడమే ఈ మోడల్ తప్పయింది.. ఫ్రెండ్స్ ఏం చేశారో తెలిస్తే..