గెలుపు వ్యూహాల్లో బీజేపీ నిమగ్నం... సత్తా చాటేనా?

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో అంతగా బలం లేని బీజేపీ దుబ్బాక ఎన్నికల్లో సత్తా చాటడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా బీజేపీ పేరు మారుమ్రోగి పోయింది.

ఇక ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలలో నాలుగు సీట్ల నుండి నలభై సీట్ల వరకు ఒక్కసారిగా బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో బీజేపీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి సారించడానికి ఒక నమ్మకం కలిగింది.

అయితే హుజూర్ నగర్ లో బీజేపీ సత్తా చాటకపోయినా  రాష్ట్ర వ్యాప్తంగా బలపడటానికి గొప్ప ముందడుగు వేసిన పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం బీజేపీ ముందున్న ఛాలెంజ్ హుజూరాబాద్ ఉప ఎన్నిక.ఈ ఎన్నికలో గెలవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది.

  ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ మరింతగా బలపడటానికి  ఈ ఉప ఎన్నిక విజయం తప్పకుండా దోహద పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రస్తుతానికి ఈటెల హుజూరాబాద్ లో బలమైన నేత కాబట్టి బీజేపీ కి ఈ నియోజకవర్గంలో బలం లేకపోవడం బీజేపీకి ఏ మాత్రం నష్టం కలిగే అవకాశం లేదు.

"""/"/ ఎందుకంటే ఈటెలతో పాటు బీజేపీ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఈటెల మాత్రం చాలా దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.ఎక్కడ ఏ చిన్న అవకాశం టీఆర్ఎస్ కు ఇవ్వకుండా బీజేపీ సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ ను మరింతగా బలహీన పరుస్తున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఉంది.

ఏది ఏమైనా బీజేపీ ఇప్పుడు గెలుపు వ్యూహాలు పన్నడంలో నిమగ్నమైన పరిస్థితి ఉంది.

  టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి బీజేపీ సన్నద్దమవుతున్న పరిస్థితి ఉంది.

మరి గెలుపు వ్యూహాలు సఫలమై హుజూరాబాద్ లో సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 20, శనివారం 2024