“మోదీ గ్యారంటీ 2024” పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..!!

"మోదీ గ్యారంటీ 2024"( Modi Guarantee 2024 ) పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో( BJP Manifesto ) విడుదల కావడం జరిగింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ గుడ్ న్యూస్ తెలియజేశారు.70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.

ముద్ర యోజన( Mudra Yojana ) కింద లోన్ల పరిమితి 20 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.

పేదలకు మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని వ్యాఖ్యానించారు. """/" / భవిష్యత్తులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తామని మోదీ( PM Modi ) కీలక ప్రకటన చేశారు.

వచ్చే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్ అందించబోతున్నట్లు పేర్కొన్నారు.సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఇంకా ఇదే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన పరిపాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ కోసం ప్రధాని మోదీ సమయాన్ని కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ( BJP ) కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

దేశ అభివృద్ధి తమ లక్ష్యం అని పేర్కొన్నారు. """/" / అంబేద్కర్ బాటలోనే తాము పయనిస్తున్నామని చెప్పారు.

వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తామన్నారు.బీజేపీ 'సంకల్ప పత్ర' మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది.

విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్ , గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి.

సాంకేతిక వికాసం.సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

కెనడాలో మ్యాగీ నూడుల్స్‌తో షాకింగ్ ప్రయోగం.. -17°C చలికి ఏం జరిగిందో చూడండి..