మణిపూర్ మంటలు ఆపడం కేంద్రానికి ఇష్టం లేదు!
TeluguStop.com
అందరూ ఊహించినట్టుగానే పునరాగమనం తర్వాత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) భాజపా కేంద్ర నాయకత్వంపై బుల్లెట్లు ఎక్కు పెట్టారు .
మణిపూర్ ( Manipur )మంటలను ఆపడం భాజపా ప్రభుత్వానికి ఇష్టం లేదని వారికి కావాల్సింది ప్రజాస్వామ్యం తగలబడి తమ నియంతృత్వం కొనసాగడం అని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు.
పొరుగు దేశాలను కంట్రోల్ చేశామని ఘనంగా చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఒక రాష్ట్రంలోని అనిచ్చితిని అణచలేక పోవడం విచిత్రంగా ఉందంటూ ఆయన దుయ్యబట్టారు.
కేంద్రం తలుచుకుంటే ఒక్క రోజులోనే మణిపూర్లో శాంతి వచ్చి ఉండేదని, కానీ కేంద్రానికి అది ఇష్టం లేదని జాతుల మధ్య వైరాలను,మతాల మధ్య విద్వేషాలను పెంచి పోషించడమే భాజపా లక్ష్యం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలపై భాజాపా నేతలు తీవ్రస్థాయి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా తగ్గకుండా రాహుల్ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు.
బాజాపా నేతలు తన ప్రసంగంపై భయపడాల్సిన అవసరం లేదని ఈరోజు తాను అదాని గురించి మాట్లాడ బోవడం లేదంటూ ప్రసంగం మొదట్లోనే భాజపాకు చురకలు అంటించారు.
తన భారత్ జోడో యాత్ర ప్రారంభంలో తనకు అహంకారం ఉండేదని అయితే దేశంలోని వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సాధక బాధకాలను అర్థం చేసుకున్న తర్వాత తనలోని అహంకారం మటుమాయం అయిపోయిందని భారత జోడయాత్ర( Bharat Jodo Yatra ) ఇంకా పూర్తి కాలేదని మరొక్కసారి యాత్రతో దేశ ప్రజలను కలుస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
"""/" / తాను నమ్మిన సత్యం కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధపడే ఉన్నానని మాట వెనక్కు తీసుకోనంటూ ఆయన పునరుద్ధరించారు.
తన యాత్ర లక్ష్యం ఏమిటి అంటూ చాలామంది తనను అడిగారని , అయితే దేశ ప్రజల సాధక బాధకాలను వినీ దేశపు హృదయాన్ని అర్థం చేసుకోవడమే తన యాత్ర లక్ష్యం అంటూ తాను చెప్పుకొచ్చినట్లుగా రాహుల్ స్పష్టం చేశారు.
విద్వేష రాజకీయాలకు మనుగడ లేదని చెప్పిన రాహుల్ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!