అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కుదరదు.. డీకే అరుణ
TeluguStop.com
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి. కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కుదరదన్నారు.
దళితులను మోసం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని విమర్శించారు.ప్రధాని కుర్చీ కోసం.
వేల కోట్లను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ పంపుతున్నారని ఆరోపించారు.
బూతు పురాణాం మానుకోకుంటే.కేసీఆర్ నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు. కంత్రీ చంద్రశేఖరరావు అని వ్యాఖ్యలు చేశారు.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ? తనను చెప్పులతో కొట్టటానికి ప్రజలు సిద్ధమైనట్లు కేసీఆర్ గ్రహించారన్నారు.
మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ నేత తెలిపారు.
దేశ ప్రధానిపై మెంటల్, పిచ్చి ఎక్కినట్లు కేసీఆర్ మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకటి తిట్టి.నాలుగు తిట్టించుకోవటం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గుర్తించటానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడ్తున్నారని తెలిపారు.నరేంద్ర మోదీ గురించి మాట్లాడే అర్హత అవినీతి సామ్రాట్ కేసీఆర్‌కు లేదన్నారు.
ఎన్నికల కోసం కాదు.దేశ హితం కోసం కేంద్రం బడ్జెట్‌ను తీసుకొచ్చిందని చెప్పా,రు.
కాళేశ్వరం డబ్బులు కాజేసి.కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ భూములపై పడిందని మండిపడ్డారు.
ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు ఎక్కడ? కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.పాస్ పోర్ట్ బ్రోకర్ కేసీఆర్‌కు లక్షల కోట్లు ఎక్కడి అని ప్రశ్నించారు.
కడుపు తిప్పలు కోసం.శాపనార్థాలు పెట్టుకుంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారని డీకే అరుణ తెలిపారు.
సినిమాలు చేయటం కంటే ఐఏఎస్ అవ్వడమే ఈజీ… సందీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!