ముస్లిం శిక్షణా తరగతులపై ఫిర్యాదు చేసిన బీజేపీ

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ఓ పక్క దేవీ నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 27,28,29 తేదీలలో ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండా మూడు రోజుల పాటు ముస్లిం శిక్షణా తరగతులు నిర్వహించి,మత మార్పిడితో పాటు విచ్చినకర శిక్షణ ఇచ్చినట్లు సమాచారం ఉందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి కనగాల నారాయణ ఆరోపించారు.

ఆదివారం అనంతగిరి పోలీసు స్టేషన్లో ముస్లిం శిక్షణా తరగతులపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మతంలోని కొంతమంది విచ్చిన్నకర వ్యక్తులు ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇందులో మత మార్పిడులతో పాటు దేశ వ్యతిరేక,దేశ విచ్ఛిన్నకర కార్యక్రమాలపై శిక్షణను ఇచ్చినట్లుగా తెలుస్తున్నదన్నారు.

ఈ శిక్షణాతరగతులపై విచారణ జరిపించి,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో దళిత మోర్చా నాయకుడు వంగాల పిచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్, టీషర్ట్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే!