విజయవాడలో అగ్నిప్రమాదంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
విజయవాడలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
జింఖానా గ్రౌండ్ లో అగ్ని ప్రమాదానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.స్థలం సామర్థ్యానికి మించి షాపులకు అనుమతి ఇచ్చారన్నారు.
ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని విమర్శించారు.దీనికి కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని తెలిపారు.
బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీకి నిర్మాత మారారా.. దిల్ రాజు అంత ధైర్యం చేస్తారా?