ప్రధాని మోదీ సభకు దూరంగా బీజేపీ ముఖ్యనేతలు..!
TeluguStop.com

మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరులో బీజేపీ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.


నిన్న మోదీ పాల్గొన్న ప్రజాగర్జన సభకు నేతలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాలేదు.


అదేవిధంగా జ్వరం కారణంగా ఎంపీ సోయం బాపురావు సైతం సభకు దూరంగా ఉన్నారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని బీజేపీ సభకు ఆహ్వానించలేదని సమాచారం.
అయితే గత కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పలువురు కీలక నేతలు మోదీ సభకు డుమ్మా కొట్టడంపై బీజేపీలో చర్చ జోరుగా సాగుతోంది.
విశ్వంభర సినిమాలో వీణ సాంగ్.. వింటేజ్ చిరంజీవి కచ్చితంగా కనిపించనున్నారా?