బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ అరెస్ట్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను నిర‌సిస్తూ.రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూర్ లో బండి సంజయ్ దీక్ష తలపెట్టారు.

ఈ దీక్ష‌ను భ‌గ్నం చేసిన పోలీసులు.ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో పోలీస్ వాహ‌నాన్ని పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు.ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య తోపులాట జ‌ర‌గ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వీడియో: లేడీ ఆఫీసర్‌తో పోలీస్ ఇన్‌స్పెక్టర్ అఫైర్.. చితకబాదిన భార్య..