ఏపీ ప్రభుత్వంలో అవినీతిపై బీజేపీ ఛార్జ్‎షీట్..!!

ఏపీ ప్రభుత్వంలో అవినీతిపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.ఈ మేరకు ఛార్జ్‎షీట్ దాఖలు చేయాలనే యోచనలో ఉంది.

జిల్లాల వారీగా అంశాలను ఖరారు చేసి, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఛార్జ్‎షీట్ తో ఫిర్యాదు చేయాలని ఏపీ నేతలకు జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా ఛార్జ్‎షీట్ లు రూపొందించేందుకు నలుగురు నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో సభ్యులుగా సీఎం రమేశ్, పురంధేశ్వరి, సత్యకుమార్ తో పాటు మాధవ్ లు ఉన్నారు.

మద్యం, ఇసుక, మట్టి, భూ ఆక్రమణలు, ప్రాజెక్టులు వంటి పలు అంశాలపై ఛార్జ్‎షీట్ లును ఏపీ బీజేపీ కమిటీ రూపొందించనుంది.

ఈ మేరకు మే 5వ తేదీ నుంచి కమిటీ తన కార్యాచరణను ప్రారంభించనుంది.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?