ఓడినా గెలిచినా రత్న ప్రభకు పెద్దపీటే ?

నిన్న హోరాహోరీగా జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో అందరికీ గెలుపు పై నమ్మకాలు ఉన్నాయి.

ముఖ్యంగా బిజెపీ వైసీపీ మధ్య పోటీ తీవ్రంగా నడిచింది.అసలు నోట కంటే తక్కువ ఓట్లు వస్తాయని ముందుగా అందరూ అంచనా వేసిన బిజెపి అభ్యర్థి రత్నప్రభ తనదైన శైలిలో ప్రచారం దూసుకుపోవడంతో,  రత్నప్రభ కు గెలుపు దక్కినా దక్కక పోయినా గౌరవప్రదమైన ఓటింగ్ శాతం మాత్రం దక్కుతుంది అనేది అందరికీ అర్థం అయిపోయింది.

వాస్తవంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేయడంపై మొదట్లో అందరూ పెదవి విరిచారు.

ఆమె కనీసం పోటీ ఇవ్వలేదని అందరు అంచనా వేశారు.కానీ రత్నప్రభ మాత్రం ప్రజలను  ఆకట్టుకోవడంలో సరికొత్త పంథాను అవలంబించి సక్సెస్ అయ్యారు.

తాను ఆషామాషీ వ్యక్తిని కాదని, 40 ఏళ్లు ఐఏఎస్ అధికారిగా పని చేశానని,  ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అమలు చేశానని, సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నానని, ఇప్పుడు రాజకీయాల్లోనూ అంతకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్న అని చెప్పుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు.

ఇక బీజేపీ చరిష్మా తో పాటు,  జనసేన సహకారం ఆమెకు లభించడంతో,  ఇప్పుడు రత్నప్రభ గెలుపుపై బిజెపి నేతలకు నమ్మకం కుదిరింది.

దీనికి తోడు కర్ణాటక బిజెపి సైతం రత్నప్రభను గెలిపించేందుకు కృషి చేయడం,  ఎక్కువ కాలం ఆమె కర్ణాటక కేడర్ లో పని చేయడం వంటివి అన్ని సానుకూల అంశాలే .

ఇక ఆమె ఇక్కడ నుంచి ఎంపీగా గెలిస్తే , కేంద్ర మంత్రి పదవి కూడా దక్కుతుందని కేంద్ర బీజేపీ పెద్దలు ఎప్పుడో హామీ ఇచ్చారు.

ఒకవేళ ఎన్నికల ఫలితం తేడా వచ్చినా, ఆమెకు మాత్రం జాతీయ స్థాయిలో కీలకమైన పదవి దక్కుతుందని,  ఈ మేరకు కేంద్ర బిజెపి పెద్దల నుంచి ఆమెకు స్పష్టమైన హామీ వచ్చింది.

అందుకే తిరుపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.తిరుపతిలో రత్నప్రభ గెలిచినా, ఓటమి చెందినా,  ఆమెకు మాత్రం జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పదవి కన్ఫామ్ కావడంతో ఆమె గెలిచినా,  ఓడినా తనకు లాభమే అన్నట్లుగా ధీమా గా ఉన్నారట.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత