Daggubati Purandeswari : ఈనెల 27న బీజేపీ బూత్ లెవెల్ కమిటీ భేటీ..!!

ఏపీలో ఈనెల 27వ తేదీన బీజేపీ బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తల సమావేశం జరగనుంది.

ఈ మేరకు సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్( Rajnath Singh ) హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) తెలిపారు.

అదేవిధంగా ప్రజాపోరు పేరుతో యాత్ర చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.ఈ యాత్ర ద్వారా ఏపీకి ఏం చేశామో చెప్పబోతున్నామన్నారు.

"""/" / వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

అధిష్టానం ఆదేశాల మేరకు లోక్ సభ లేదా అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తానని ఆమె తెలిపారు.

అనంతరం వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన ఆమె జగన్( CM Ys Jagan ) మద్యపాన నిషేధం చేస్తామని అమలు చేయలేదని విమర్శించారు.

నాణ్యత లేని మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?