న్యాయవాది దంపతులు హత్యపై బీజేపీ ఫోకస్.. అధికార పార్టీకి ఇరకాటం తప్పదా.. ??

తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై బీజేపీ యుద్ధానికి సిద్దం అవుతుందట.ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మంథని న్యాయవాది దంపతుల జంట హత్యపై బీజేపీ ఫోకస్ పెట్టిందని ప్రచారం.

అదీగాక ఆ దంపతుల హత్యలో పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హస్తముందని వార్త ప్రాచరం జరుగుతున్న నేపధ్యంలో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా బీజేపీ చలో మంథని కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందట.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోని, మంథని స్థానిక సమస్యలు, ఇసుక మాఫియా, అధికార పార్టీకి చెందిన నాయకుల ఆగడాలపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తూ, వామనరావు కుటుంబ సభ్యులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రణాళికలు వేస్తుందట.

ఇదే విషయమై బండి సంజయ్ బీజేపీ ముఖ్యనేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ క్రమంలో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం 200 మంది న్యాయవాదులు, పార్టీ ముఖ్య నేతలతో మంథని వెళ్లాలని నిర్ణయించారట.

"""/"/ ఇకపోతే ఇసుక మాఫియా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన అంశాలతో కూడా ఈ కేసు ముడిపడి ఉన్నందున రాజకీయంగా అధికార పార్టీపై వత్తిడి తేవచ్చని బీజేపీ భావిస్తుందట.

మరి వీరి ఆలోచన వల్ల గులాభికి పార్టీకి జరిగే నష్టం ఎంటో చూడాలి.

ఏపీ సీఎస్, డీజీపీకి సీఈసీ సమన్లు..!