తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జిలను నియమించిన బీజేపీ !

దక్షిణాదిలో బలపడాలని కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఎప్పటి నుంచో కలలుకంటోంది.అయితే ఆ ఆశ మాత్రం తీరలేదు.

పోనీ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అయినా ఆ పార్టీ పరువు దక్కించుకుందా అంటే అదీ లేదు.

కేవలం ఒక్కటంటే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అలాగే మరి కొద్ది నెలల్లో ఏపీలోనూ.

ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జిలను హైకమాండ్ నియమించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మురళీ ధరన్, సునీల్ దేవ్‌దర్‌, తెలంగాణకు అరవింద్ లింబావలీలను లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జులుగా ఉంటారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అలాగే.దేశవ్యాప్తంగా చూసుకుంటే రాజస్థాన్ ఇన్‌చార్జిగా ప్రకాష్ జవదేవకర్‌, సుధాంశు త్రివేది, అసోంకు మహేంద్ర సింహ్, బీహార్‌కు భూపేంద్ర యాదవ్, ఛత్తీస్‌గఢ్‌కు అనిల్ జైన్, గుజరాత్‌కు ఓం ప్రకాష్ మాధుర్, హిమాచల్ ప్రదేశ్‌కు తీరథ్ సింహ్ రావత్, జార్ఖాండ్‌కు మంగల్ పాండ్య, మధ్య ప్రదేశ్‌కు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ ఉపాధ్యాయ, నాగాలాండ్, మణిపూర్‌లకు నళినీ కోహలీ, ఒడిషాకు అరుణ్ సింహ్, పంజాబ్‌కు కెప్టెన్ అభిమన్యు, సిక్కింకు నితిన్ నవీన్, ఉత్తరాఖండ్‌కు థావర్ చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్‌కు గోవర్ధన్, దుష్యంత్ గౌతమ్ అభిమన్యు ఇన్‌చార్జులుగా గా ఉంటారు.

సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులకు పక్కా ఆధారాలు.. బన్నీ కెరీర్ కు ఇబ్బందేనా?