టీడీపీ పై సై సై అంటున్న బీజేపీ ? సీఐడీ కి ఫిర్యాదు ?

తెలుగుదేశం పార్టీ విషయంలో బీజేపీ ఒక క్లారిటీ వచ్చేసింది.అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతింటేనే, తమకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయానికి వచ్చేసినట్టుగా వ్యవహరిస్తోంది.

కొద్ది రోజులుగా ఆ పార్టీ అగ్రనేతల దగ్గర నుంచి ఏపీ నాయకుల వరకు ఈ విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పూర్తిగా టీడీపీ పైన దృష్టి సారించి రాజకీయ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.

అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ కి అనుకూలంగానే ఉంటూ, ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం మూడు రాజధానులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధానికి చంద్రబాబు లేఖ రాయడం కలకలం సృష్టించింది.

ఈ వ్యవహారంపై బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు టీడీపీ పై చేసింది.

ముఖ్యంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చంద్రబాబు తీరును తప్పు పడుతూ, అనేక అంశాలను ప్రశ్నించారు.

ఇంత వరకు బాగానే ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం బీజేపీ కి వ్యతిరేకంగా టీడీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడం పైన బీజేపీ దృష్టిసారించింది.

తాజాగా టీడీపీకి చెందిన రామయ్య అనే ఓ వ్యక్తి జై తెలుగుదేశం, టీడీపీ యూత్ అనే పేరుతో కొన్ని ఫేస్ బుక్ పేజీలను నిర్వహిస్తూ, ఆ పేజీ ద్వారా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా, ఏపీ బీజేపీ ఆరోపించడమే కాకుండా, ఈ వ్యవహారంపై పూర్తిగా దర్యాప్తు చేపట్టాలంటూ మంగళగిరి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రంగంలోకి దిగడం వంటి వ్యవహారాలు నడిచాయి.

టీడీపీ విషయంలో మొన్నటి వరకు మెతకవైఖరి అవలంభించినా, ఇప్పుడు మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా రాజకీయంగా వాడుకోవాలని బీజేపి చూస్తోంది.

"""/"/ తాజాగా జీవీఎల్ వ్యాఖ్యలపై టీడీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ పరంగానే ఫిర్యాదు చేసింది.

ఇక ముందు ముందు కూడా ఇదే వైఖరితో టీడీపీ విషయంలో వ్యవహరించాలని, ఏదో ఒక రకంగా బీజేపీని ఏపీ లో యాక్టివ్ చేయాలనే విధంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

అయితే ఈ విషయంలో టీడీపీ కూడా స్పందించింది.నేరుగా బీజేపీ పై విమర్శలు చేయకుండా, జీవీఎల్ ను టార్గెట్ చేసుకుని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వంటి వారు స్పందించి విమర్శలు చేశారు.

అలాగే వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం జీవీఎల్ పై విమర్శలు చేశారు.

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై భారీ రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ