కమిటీల ఏర్పాటుతో దూకుడుగా బీజేపీ.. అసలు వ్యూహం ఇదేనా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలతో పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది.

అయితే వచ్చే ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారింది.

అయితే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే బండి సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు ఏడు శాతం మాత్రమే ఉన్న బీజేపీ ఓటుబ్యాంకు ముప్పై శాతం కు పెరగడంతో బీజేపీ నేతలు ఇంకా మరింతగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది.

అందులో భాగంగానే తాజాగా రాష్ట్ర స్థాయి కీలక నాయకులతో కమిటీలు వేస్తూ క్షేత్ర స్థాయిలో బీజేపీని పటిష్టంగా చేయడానికి రకరకాల వ్యూహాలను పన్నుతోన్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే సాధ్యమైనంత వరకు బీజేపీలో  చాలా వ్యూహాత్మక ప్రయాణం అనేది కొనసాగుతోన్న పరిస్థితిని చూస్తున్నాం.

"""/"/ అయితే కమిటీల ఏర్పాటుతో నాయకులకు ప్రాధాన్యతనిస్తూ పార్టీని పటిష్టంగా చేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్తున్నారు.

కమిటీల ఏర్పాటు ద్వారా ఈ రాష్ట్ర స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి నియోజకవర్గ స్థాయి కమిటీల ద్వారా నియోజకవర్గంలో  కాస్త బీజేపీ బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది.

తద్వారా వచ్చే ఎన్నికల్లో స్థానికంగా బలంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇవ్వాలనే వ్యూహాన్ని బలంగా అమలు చేస్తోన్న పరిస్థితి ఉంది.

మరి ఈ కమిటీల ఏర్పాటుతో బీజేపీ ఏ మేరకు బలపడుతుందనేది చూడాల్సి ఉంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్