బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ( Eleti Maheshwar Reddy )సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) తరువాత రాజకీయ పరిస్థితులు మారుతాయని తెలిపారు.
బీఆర్ఎస్ తో కలిసి సొంత దుకాణం పెట్టుకోవటానికి సీఎం రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బీఆర్ఎస్ తో చేతులు కలుపుతారని ఆరోపించారు.
కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారని తెలిపారు.
లేదంటే ఎమ్మెల్యేలను చీల్చి మాదే అసలైన బీఆర్ఎస్ అనేలా చేస్తారని చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పది మంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైడ్ చేసే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీజేపీకి లేదని తెలిపారు.చంద్రబాబు, రేవంత్ రెడ్డికి చాలా పోలికలు ఉన్నాయని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను కబ్జా చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
వివేక్ రామస్వామి, మస్క్‌ల రూపంలో బీజింగ్‌కు ముప్పు .. చైనా విద్యావేత్త హెచ్చరిక