కాకరకాయ పొడిని అన్నంలో కలిపి తింటే.. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు..
TeluguStop.com
కూరగాయలలో కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది.చక్కెర వ్యాధిగ్రస్తులు కాకరకాయను ఎక్కువగా ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటారు.
కాకరకాయ ఎంత చేదుగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి, బరువును తగ్గించుకోవడానికి, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో కాకరకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
కాకరకాయతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
కాకరకాయతో చేసుకునే వివిధ రకాల వంటల్లో కాకరకాయ కారం పొడి కూడా ఎంతో రుచిగా ఉంటుంది.
కాకరకాయతో చేసే ఈ కారంపొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.కాకరకాయ పొడి తయారీ చేయడానికి కావలసిన పదార్థాలు.
పావు కిలో కాకరకాయలు, ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, మూడు టేబుల్ స్పూన్ల కారం, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల చింతపండు, మూడు టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, గుప్పెడు కరివేపాకు దీనికోసం ఉపయోగించాలి.
కాకరకాయ కారంపొడి తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కళాయిలో నూనె వేడి చేసి నూనె వేడి అయినా తర్వాత కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.
వీటిని ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. """/"/
ఆ తర్వాత అదే నూనెలో పల్లీలు వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
కరివేపాకు వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.ఒక జార్ లో వేయించిన కాకరకాయ ముక్కలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, జీలకర్ర, చింతపండు వేయించిన కరివేపాకులో సగం వేసుకొని బరకగా మిక్సీ పట్టాలి.
ఈ కారం పొడిని ఒక గిన్నెలో తీసుకొని వేయించిన పల్లీలు మిగిలిన కరివేపాకు వేసి కలపాలి.
ఇలా తయారు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పొడి తయారవుతుంది.
దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
ఈ కారంపొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజులపాటు తాజాగా ఉంటుంది.
కాకరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడు ఇలా కారంపొడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.
How Modern Technology Shapes The IGaming Experience