కొరియాలో ఇండియన్ యూట్యూబర్‌కు చేదు అనుభవం..

ఇటీవల పాపులర్ యూట్యూబర్‌ దీపాంశు సంగ్వాన్( Deepanshu Sangwan ) సౌత్ కొరియా వెళ్లాడు.

అక్కడ వీడియోలు తీస్తుండగా ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురయింది.దీపాంశు కొరియాలో రేసిజం (ఒక జాతి వాళ్లని తక్కువ చూసే భావన) ఫేస్ చేసినట్లు చెప్పాడు.

ప్రజలు వేరే దేశాలకి వెళ్లినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయడం కామన్ అని కూడా అన్నాడు.

నోమాడిక్ ఇండియన్( Nomadic Indian ) అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడిపే దీపాంశు ప్రపంచం మొత్తం తిరుగుతూ తన అనుభవాలను వీడియోలుగా చేసి పెడుతుంటాడు.

ఇప్పటికే 12 దేశాలు తిరిగాడు.కానీ, కొరియా గురించి చేసిన ఈ వీడియో మాత్రం మిగతా వీడియోలలా సరదాగా లేదు.

కొరియాలో తాను ఎలాంటి రేసిజం ఎదుర్కొన్నాడో ఈ వీడియోలో చాలా సీరియస్‌గా చెప్పాడు.

దీపాంశు సంగవాన్ కొరియాలో తిరిగినప్పుడు చాలామంది తనను వింతగా చూశారని చెప్పాడు.తన చర్మం బ్రౌన్ కలర్‌లో ఉండటం వల్లనే ఇలా జరిగిందని ఆయన భావిస్తున్నాడు.

"మనం భారతీయులం, మన చర్మం బ్రౌన్ కలర్‌లో ఉంటుంది, దీనికి మనం ఏం చేయలేము కదా! మనం ఇలానే పుట్టింది" అని ఆయన బహిరంగంగా చెప్పాడు.

"""/" / "కొరియన్ల సంస్కృతి చాలా వరకు చైనీస్ సంప్రదాయాలు, ఇతర ప్రభావాల నుంచి కాపీ కొట్టడం జరిగింది కాబట్టి, మనం కూడా కొరియన్ల గురించి చులకనగా అనుకోవచ్చు.

" అని ఆయన అన్నాడు.భారతదేశంలో కూడా రేసిజం ఉందని ఆయన అంగీకరిస్తున్నాడు.

అయితే, "మనం ఇతరులని అలా వింతగా చూడము.అవును, ఆఫ్రికా నుంచి వచ్చిన వారు భారతదేశంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు, కానీ చీప్‌, డర్టీ లుక్స్ ఇండియన్స్‌ ఇవ్వరు.

" అని చెప్పాడు. """/" / ఈ సమస్య భారతీయులకు మాత్రమే పరిమితం కాదని దీపాంశు నొక్కి చెప్పాడు.

కొరియా నుంచి కాకుండా వేరే దేశాల నుండి వచ్చిన వారిని కొరియన్లు తరచుగా తక్కువగా చూస్తారని ఆయన గమనించాడు.

దీపాంశు కొరియాలో ఎదుర్కొన్న రేసిజం గురించి చెప్పిన తర్వాత, సోషల్ మీడియా( Social Media )లో పెద్ద చర్చ మొదలైంది.

"కొరియాలో భారతీయులు తమ చర్మం రంగు వల్ల రేసిజం ఎదుర్కొంటున్నారు." అని ఒక పోస్ట్‌లో రాశారు.

చాలా మంది తమ అనుభవాలను కామెంట్‌లలో పంచుకున్నారు.ఒకరు, "కొరియన్లు చాలా రేసిస్టులు" అని అన్నారు.

మరొకరు సింగపూర్, జపాన్‌( Singapore, Japan )లలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.

ఒక సింగపూర్ వ్యక్తి "భారతీయులు చాలా రూడ్ గా ఉంటారు, నియమాలు పాటించరు, సివిక్ సెన్స్ లేదు కాబట్టి నాకు వాళ్లు నచ్చరు" అని ఒకసారి చెప్పాడని పంచుకున్నారు.

రేసిజం కొరియాలో సాధారణమని మరొకరు చెప్పారు."మనం మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటే గౌరవం సంపాదించుకోవచ్చు, కానీ మనం బస్సు టికెట్లు, ధాన్యం వంటి ఉచిత పంపిణీలపై దృష్టి పెడుతున్నాము" అని ఆయన అన్నారు.

ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌లో స్నాక్స్ అమ్ముతున్న పాక్ అమ్మాయి.. వింటే దిమ్మతిరగాల్సిందే