వైరల్: ‘బిర్యానీ సమోసా’ అంట… అసలెలా వస్తాయండి మీకీ ఐడియాలు?
TeluguStop.com
'సమోసా' అంటే ఇష్టపడనివారు ఇక్కడ ఎవరుంటారు చెప్పండి? ఈవెనింగ్ అలా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి వేడివేడి సమోసా తింటే ఆ మజానే వేరుంటుంది కదూ.
అదేవిధంగా మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అందులో అమ్మేటువంటి ఆనియన్ సమోసా మీరు తినే వుంటారు.
అదొక టైం పాస్ అని అందరూ ఫీల్ అవుతూ కరకరా నమిలేస్తూ వుంటారు.
ఇంకా చెప్పాలంటే సమోసాతో మనకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి.అయితే మనలో ఎవరైనా రెండు రకాల సమోసాలను రుచి చూసి వుంటారు.
ఒకటి ఆనియన్ సమోసా అయితే రెండవది ఆలు సమోసా.దాదాపుగా మనకి మార్కెట్లో దొరికేవి ఈ రెండే.
అయితే సమోసాల( Samosa ) పట్ల మనుషులకున్న ఇష్టాన్ని గుర్తులో పెట్టుకొని చాలామంది వ్యాపారాలు రకరకాల సమోసాలను తయారుచేసి నేడు మార్కెట్లో అమ్ముతూ వున్నారు.
కార్న్ సమోసా అని, మసాలా సమోసా అని, బఠాణి సమోసా అని ఇలా రకరకాలుగా.
తయారు చేస్తున్నారు.ఇవి కూడా రుచికి బాగానే ఉంటాయి.
ఐతే ఇప్పుడు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్న పోస్ట్ చూస్తే అవాక్కవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
మరి ఆ వ్యాపారి సమోసాని మామ్మూలుగా చేస్తే ఏం మజా ఉంటుంది అని అనుకున్నాడేమో గాని.
ఓ విచిత్రమైన ఐడియాని ఇంప్లిమెంట్ చేసాడు. """/" /
మరి ఆ స్పెషల్ డిష్ ఏమిటో తెలుసుకోవాలనుందా? ఇక్కడ మనోడు సమోసాలో వేడి వేడి బిర్యానీని( Biryani Samosa ) పెట్టి ఆయిల్ లో వేయిస్తున్నాడు.
దానికి ముందుగా చపాతీ పిండిని ముద్దగా చేసి.దానిని సమోసా షేర్ లో చుట్టి.
అందులో బిర్యానీని నింపుతున్నాడు.ఈ పోస్ట్ ఖంసామా అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
అయితే నెటిజన్లు ఈ వంటకం పట్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు.కొందరు నెటిజన్లు 'ఈ వంటకం చూసిన తర్వాత, నేను తినాలనుకోవడం లేదు' అని కామెంట్ చేస్తే, మరికొందరు 'కస్టమర్‌ను ఆకట్టుకునేందుకు ఒక్కోసారి దుకాణదారుడు కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాడు.
ఇది కూడా ఆకోవకు చెందినదే' అని కామెంట్ చేస్తున్నారు.
పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..