హాస్య చక్రవర్తికి జేజేలు… 50 ఏళ్లపాటు నవ్వులు పూయించిన మహానుబావుడు!

హాస్య చక్రవర్తి అనగానే అందరి మదిలో ఒకే ఒక్క పేరు మెదులుతుంది.అవును, ఆయనే అల్లు రామలింగయ్య.

( Allu Ramalingaiah ) అల్లు అంటేనే హాస్యపు జల్లు అన్న మాదిరి ఆయన సినీ నట ప్రస్థానం సాగిందని చెప్పుకోవచ్చు.

53 ఏళ్ళ కెరీర్‌లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య జయంతి ( Allu Ramalingaiah Jayanthi ) అక్టోబర్‌ 1వ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి ఇపుడు తెలుసుకుందాం.

ఇప్పటి తరం వారికి కూడా ఆయన పేరు తెలుసు అంటే, ఆయన ఎన్ని సినిమాలు చేసి, సినీ కళామతల్లికి సేవలు అందించాడో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎంత మంది హాస్యనటులు ఉన్నా.అల్లు రామలింగయ్య హాస్యానికి ఉన్న ప్రత్యేకత వేరు.

తన కెరీర్‌లో చేసిన వందల సినిమాల్లోని హాస్య పాత్రలన్నీ ఎంతో విభిన్నంగా, విలక్షణంగా ఉండడమే ఆయన ప్రత్యేకత.

"""/" / ఆయన బాడీ లాంగ్వేజ్‌, నటన నుండి డైలాగ్‌ డెలివరీ చేసే విధానం వరకు అన్నీ చాలా ప్రత్యేకంగా కనబడేవి.

అయితే, సినిమాల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా సీరియస్ గా, హుందాగా ఉండేవారట.

ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదట.1950లో ‘పుట్టిల్లు’ చిత్రంతో( Puttillu Movie ) నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అల్లు రామలింగయ్య చివరి చిత్రం 2003లో వచ్చిన ‘కళ్యాణరాముడు’లో నటించారు.

"""/" / 1992 అక్టోబర్‌ 1న పాలకొల్లులో( Palakollu ) జన్మించిన అల్లు రామలింగయ్య వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు ఏడో సంతానంగా పుట్టాడు.

అల్లు రామలింగయ్యకు చదువుకంటే ఇతర వ్యాపకాలు ఎక్కువ.చిన్నతనంలోనే అందర్నీ అనుకరిస్తూ నవ్వించేవారట.

అలా చేస్తుండగానే నటించాలన్న ఆసక్తి పెరిగి, మొదట నాటకాల్లో నటించారు.ఈ క్రమంలోనే సినిమాల్లోకి అడుగు పెట్టారు.

తొలి చిత్రం ‘పుట్టిల్లు’ ఆర్థికంగా విజయం సాధించకపోయినా.అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టిందని భోగట్టా.

ముఖ్యంగా.అప్పటి అగ్ర తారలు ఎన్టీఆర్‌,( NTR ) ఎఎన్నార్‌లతో( ANR ) కలిసి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు.

"""/" / ‘పరివర్తన’, ‘వద్దంటే డబ్బు’, ‘చక్రపాణి’, ‘దొంగ రాముడు’, ‘మిస్సమ్మ’, ‘సంతానం’, ‘మాయాబజార్‌’, ‘భాగ్యరేఖ’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘తోడికోడళ్ళు’, ‘ఆడపెత్తనం’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘ఇల్లరికం’.

ఇలా 1950వ దశకంలో లెక్కకు మించిన సినిమాలు చేసిన అల్లు ఆ తర్వాతి కాలంలో కామెడీ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోవడం జరిగింది.

ఎంతలా అంటే, ఆయన కోసమే రచయితలు ప్రత్యేకంగా పాత్రల్ని రాసేవారట.50 ఏళ్ళ సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన అల్లు రామలింగయ్య సినిమా రంగానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

కొడుకు డైరెక్ట్ చేసిన సినిమాకు తండ్రి రేటింగ్ ఎంతిచ్చారంటే?