బిపిన్ రావత్ మరణం పట్ల రియాక్ట్ అయిన మోడీ..!!

భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ మరణం పట్ల సోషల్ మీడియాలో ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయనతో పాటు ఆయన భార్య మరియు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తనకి తీవ్ర వేదనకు గురి చేసిందని తెలిపారు.

వారంతా దేశం కోసం అంకితభావంతో సేవలందించారని ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సానుభూతి సంతాపం తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

బిపిన్ రావత్ నిజమైన సైనికుడు.దేశ భక్తుడు అని కొనియాడారు.

భారత సాయుధ బలగాలను.ఆధునిక రించడంలో ఎంతో కృషి చేశారని, విశిష్ట సేవలందించారని స్పష్టం చేశారు.

కీలక సమయాలలో ఆయన ఆలోచనలు మరియు దృక్కోణాలు ఎంతో దేశానికి ఉపయోగకరంగా ఉండేవని తెలిపారు.

అటువంటి వ్యక్తి ప్రాణాలతో లేరంటే చాలా బాధగా ఉందని స్పష్టం చేశారు.భారత మొట్టమొదటి సిడిఎస్ గా ఆయన అనుభవంతో అందించిన సేవలు దేశం ఎప్పుడు మర్చిపోదని  స్పష్టం చేశారు.

ఇదే సమయంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బిపిన్ రావత్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశిస్తూ.. పోలీసులకు చిక్కి, ఇమ్మిగ్రేషన్ కస్టడీలో భారతీయుడు మృతి