తల్లి శబరిమల కొండ ఎక్కేందుకు ప్రయత్నించినందుకు కూతురుకు కష్టాలు... తప్పెవరిది?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శబరిమలలో మహిళల ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

భక్తులు మహిళల ప్రవేశంను వద్దంటూ కోరుతుండగా, సుప్రీం కోర్టు ఆదేశాలు అంటూ కొందరు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు, ఇద్దరైతే ఏకంగా అయ్యప్పను దర్శించేసుకున్నారు.

గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వివాదం ముదిరి పాకాన పడినది.ఎవరైతే అయ్యప్ప దర్శనం కోసం ప్రయత్నించారో వారు ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అసలు వారు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు.ఆ ఆడవారితో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఇబ్బందులను ఫేస్‌ చేయాల్సి వస్తుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గత సంవత్సరం అక్టోబర్‌లో కేరళకు చెందిన బింధుతాంకం కళ్యాణి అనే 43 ఏళ్ల మహిళ శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు కొండ ఎక్కే ప్రయత్నం చేసింది.

ఆరోజు ఆమెతో పాటు పలువురు మహిళలను కూడా భక్తులు అడ్డుకున్నారు.దాంతో అంతా కూడా వెనుదిరిగి వచ్చారు.

అప్పటి నుండి కూడా బిందుతాంకం కళ్యాణి మరియు ఆమె కుటుంబ సభ్యులు కేరళలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు.

ఆమె 11 సంవత్సరాల కూతురు చదువుతున్న స్కూల్‌లో వివక్షను ఎదుర్కొంది.అక్కడ స్నేహితులు మరియు ఇతరుల వల్ల ఆమె వేరు చేయబడినది.

దాంతో ఆ స్కూల్‌ నుండి తన కూతురును బిందుతాంకం మార్పించాలని భావించింది.కొన్ని రోజుల క్రితం బిందుతాంకం తన కూతురు అడ్మీషన్‌ కోసం అనైకట్టి ప్రాంతంలోని ఒక స్కూల్‌కు వెళ్లిందట.

ఆ సమయంలో అడ్మీషన్‌ ఇస్తామని చెప్పిన స్కూల్‌ యాజమాన్యం, తాజాగా వెళ్లినప్పుడు మాత్రం మీ పాపకు మేము సీటు ఇవ్వలేమని చేతులెత్తేశారట.

బిందుతాంకం స్కూల్‌కు వెళ్లిన సమయంలోనే స్కూల్‌ ముందు 100 మంది వరకు గుమ్మి గూడి ఉన్నారట.

వారు ఎవరో అని తాను మొదట భావించాను, అయితే వారు నాకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు అక్కడికి చేరుకున్న వారని ఆ తర్వాత నాకు తెలిసిందని ఆమె అన్నారు.

నా కూతురు భవిష్యత్తు నాశనం అయ్యేలా ఉందని, ఏ స్కూల్‌లో కూడా అడ్మీషన్‌ ఇవ్వకుంటే తన చదువు ఎలా అంటూ బిందుతాంకం ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కూతురు భవిష్యత్తు గురించిన ఆలోచన ఉన్న నీవు ఎందుకు శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలని భావించావు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది విశ్వసించే అభిప్రాయంను నువ్వు ఎందుకు కాలరాయాలని భావించావు అంటూ కేరళకు చెందిన హిందుత్వ వాదులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బిందుతాంకం ఎదుర్కొంటున్న వివక్షను తప్పుబడుతున్నారు.ఆమె కూతురుకు స్కూల్స్‌ అడ్మీషన్‌ను నిరాకరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటూ ప్రజాసామ్యవాదులు అంటున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఒక పాప భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ గొడవలో తప్పెవరిదో మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో మాతో పంచుకోండి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ వస్తుందా.. ఈ కాంబోలో సీక్వెల్ వస్తే హిట్ అంటూ?