బింబిసార తొలిరోజు కలెక్షన్ల వివరాలివే.. కళ్యాణ్ రామ్ కెరీర్ హైయెస్ట్ అంటూ?

బింబిసార తొలిరోజు కలెక్షన్ల వివరాలివే కళ్యాణ్ రామ్ కెరీర్ హైయెస్ట్ అంటూ?

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.

బింబిసార తొలిరోజు కలెక్షన్ల వివరాలివే కళ్యాణ్ రామ్ కెరీర్ హైయెస్ట్ అంటూ?

ఈ సినిమాకు శని, ఆదివారాలలో కూడా బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి.బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

బింబిసార తొలిరోజు కలెక్షన్ల వివరాలివే కళ్యాణ్ రామ్ కెరీర్ హైయెస్ట్ అంటూ?

బాక్సాఫీస్ వద్ద బింబిసార దూకుడుకు బ్రేకులు వేయడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.16 కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమా విడుదల కాగా తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు 7 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఫస్ట్ వీకెండ్ కు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నైజాంలోనే ఈ సినిమా 2 కోట్ల 12 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమా బింబిసార కావడం గమనార్హం.

విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో తొలిరోజే బింబిసారకు ఈ స్థాయిలో కలెక్షన్లు సాధ్యమయ్యాయి.

సీతారామం మూవీ నుంచి పోటీ లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

"""/" / బింబిసార సక్సెస్ తో కళ్యాణ్ రామ్ అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.

సినిమాలో ఊహలకు అందని ట్విస్టులు ఉండటం సినిమాకు ప్లస్ అయింది.దర్శకుడు వశిష్ట ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించారు.

రొటీన్ కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతమైన కథనంతో తెరకెక్కడం కూడా బింబిసార ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి కారణమని చెప్పవచ్చు.

విశ్వంభర సినిమాలో వీణ సాంగ్.. వింటేజ్ చిరంజీవి కచ్చితంగా కనిపించనున్నారా?