ఫస్ట్ వారం కలెక్షన్స్ కుమ్మేసిన బింబిసార.. ఈ వీకెండ్ కూడా వేట షురూ!

టాలీవుడ్ బాక్సాఫీస్ జులై నెల మొత్తం వెలవెల బోయింది.వరుస ప్లాప్స్ తో సందడి లేకుండా పోయింది.

అయితే కష్టకాలంలో ఉండగా ఆ పరిస్థితులను మార్చి మళ్ళీ బాక్సాఫీస్ కళకళ లాడేలా చేయడంలో బింబిసార సినిమా కూడా తోడ్పడింది.

గత వారం వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కింది.

ఈ సినిమాను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడితెరకెక్కించారు.అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.

అలాగే వసూళ్ల పరంగా కూడా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్య పరుస్తుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రిలీజ్ అయినా మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి లాభాల బాట పట్టింది.

వీకెండ్ లో అదరగొట్టిన బింబిసార మొత్తం రాబట్టిందో రిపోర్ట్ వచ్చేసింది.ఈ సినిమా మొత్తంగా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఫస్ట్ వీక్ లోనే 26 కోట్ల వసూళ్లను రాబట్టిందట.

"""/"/ ఇక ఈసారి వెకెండ్ తో పాటు ఆగష్టు 15 సెలవు కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

దీంతో ఈ వీకెండ్ ముగిసే సమయానికి 30 కోట్లను క్రాస్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెద్ద ప్లస్ అయ్యింది.మరి ఈ సినిమా ఈ వీకెండ్ సెలవులతో కలిసి ఎంత రాబడుతుందో చూడాలి.

ఏంటి.. శ‌రీరంలో కాల్షియం లోపిస్తే గుండె జబ్బులు వ‌స్తాయా..?